ఢిల్లీలో కోటి రూపాయలు మేఘాల పాలు.. ఫలితం ఇవ్వని క్లౌడ్ సీడింగ్.. కృత్రిమ వర్షం కురవకపోవడంపై విమర్శలు

ఢిల్లీలో కోటి రూపాయలు మేఘాల పాలు.. ఫలితం ఇవ్వని క్లౌడ్ సీడింగ్.. కృత్రిమ వర్షం కురవకపోవడంపై విమర్శలు

ఇదిగో వర్షం.. సాయంత్రం కురుస్తుంది.. అదిగో మేఘాలు.. ఇక దంచికొట్టుడే.. ఇవి ఢిల్లీలో గత రెండు మూడు రోజులుగా ప్రభుత్వం, ప్రజల నోట మెదిలిన మాటలు. దీపావళి తర్వాత దారుణమైన పొల్యుషన్ తో ఇబ్బంధి పడుతున్న ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు.. కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన క్లౌడ్ సీడిండ్ సక్సెస్ కాలేదు. మూడు రోజులు మేఘమథనం చేసినప్పటికీ కృత్రిమ వర్షాలు కురిపించలేకపోయారు. దీంతో కోటి రూపాయలు మేఘాలపాలు అయ్యాయని.. వర్షం మాత్రం కురవలేదనే టాక్ నడుస్తోంది. 

ఐఐటీ కాన్పూర్ తో సహకారంతో ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేసింది ప్రభుత్వం. అక్టోబర్ 23 న ఒకసారి, 28 తేదీన రెండు సార్లు క్లౌడ్ సీడిండ్ చేశారు. హెలీకాప్టర్లలో మేఘాల్లోకి వెళ్లి క్లౌడ్ సీడింగ్ చేశారు. కానీ వర్షాలు మాత్రం పడకపోవడంపై ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

ఖరీదైన కృత్రిమ వర్షం తంతు:

క్లౌడ్ సీడిండ్ తంతు ఖరీదైనదిగా ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. అక్టోబర్ 28న చేపట్టిన రెండు ట్రయిల్స్ ఖర్చు 60 లక్షల రూపాయలని కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ చెప్పారు. మొత్తం 300 స్క్వేర్ కిలోమీటర్లలో క్లౌడ్ సీడింగ్ చేశారు. అంటే ఒక చదరపు కిలోమీటర్ కు 20 వేల రూపాయలు ఖర్చు అయినట్లు ఆయన తెలిపారు. 

ఈ చలికాలం నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ ప్రభుత్వం ఐదు సార్లు క్లౌడ్ సీడింగ్ ప్రయోగం చేపట్టింది. గాలిలో ఉన్న విషవాయువులను తొలగించేందుకు కృత్రిమ వర్షం కురిపించే లక్ష్యంతో ఇప్పటి వరకు రూ.3.21 కోట్లు ఖర్చు చేసినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మన్ జిందర్ సింగ్ సిర్సా తెలిపారు. మొత్తం తొమ్మిది ట్రయల్స్ చేసేలా ఐఐటీ కాన్పూర్ తో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. అంటే ఒక్కో ట్రయల్ కు 35 లక్షల 67 వేలు ఖర్చు అవుతున్నట్లు తెలిపారు.