ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో జగిత్యాల బాలిక

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో  జగిత్యాల బాలిక

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాకు చెందిన లంకన్నగారి శ్వేష్ట రెడ్డి(3ఏండ్లు) అనే బాలిక జ్ఞాపకశక్తితో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించుకుంది. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల పేర్లను కేవలం నిమిషంలోనే గుర్తుచేసి, అత్యంత వేగంగా చెప్పిన టాడ్లర్‌‌‌‌‌‌‌‌గా శ్వేష్ట ఈ రికార్డు సృష్టించింది. 

బాలిక ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ జూన్ 8న ఈ రికార్డును అధికారికంగా ధృవీకరించి, రెండు రోజుల కింద సర్టిఫికెట్, మెడల్‌‌‌‌‌‌‌‌ను అందజేసింది. ‘ఫాస్టెస్ట్ టాడ్లర్ టు రీకాల్ క్యాపిటల్స్ ఆఫ్ ఆల్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్’ విభాగంలో ఈ పురస్కారం లభించింది.