- ములుగు డీఎంహెచ్‌వో గోపాల్రావు
మంగపేట, వెలుగు: మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు వైద్య సేవల కోసం టీటీడీ కల్యాణ మండపంలో 30 పడకల తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈనెల 27వ తేదీ నుంచి శనివారం మధ్యాహ్నం వరకు 1,86,689 మందికి చికిత్సలు అందించినట్టు ములుగు జిల్లా వైద్యాధికారి గోపాల్రావు తెలిపారు. ఇందులో 3,623 ఇన్ పేషెంట్స్, 1,83,66 మంది అవుట్ పేషెంట్స్‌కు సేవలు అందించామని పేర్కొన్నారు.
మరో 2,369 మంది భక్తులకు గద్దెల వద్ద భక్తులు విసిరిన బంగారం, బెల్లం తగిలి గాయాలు అయ్యాయి. 148 మందికి తేలు కుట్టగా, ఒకరు పాము కాటుకు గురవగా ట్రీట్ మెంట్ చేశామని వివరించారు. అనారోగ్య కారణాల తో జాతర తొలి రోజు నుంచి శనివారం వరకు ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరికి డెలివరీలు చేశామని డీఎంహెచ్‌వో తెలిపారు.
