హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీలో మరో 30 మైకనైజ్డ్ మల్టీలెవెల్పార్కింగ్కాంప్లెక్స్లు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుంది. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా పార్కింగ్ ప్లేస్ లు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్ల పక్కన పార్కింగ్ చేస్తుండడంతో భారీగా ట్రాఫిక్ జామవుతోంది. ఇక బిజినెస్ ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతాల్లోనూ పార్కింగ్ సమస్య ఉంది. సిటీలోని పెద్ద పార్కుల వద్ద ఉదయం, సాయంత్రం తీవ్రమైన రద్దీ ఉంటోంది. బయట రోడ్లపై వాహనాల పార్కింగ్తో ట్రాఫిక్ నిలిచిపోతోంది.
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మార్కెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఇదే తరహా సమస్య ఉంది. దీన్ని అధిగమించడానికి కొంతకాలం కింద కేబీఆర్ పార్క్ వద్ద జీహెచ్ఎంసీ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన మల్టీ లెవెల్ పార్కింగ్ విజయవంతమైంది. దీంతో నగర వ్యాప్తంగా రద్దీగా ఉండే 30 ప్రాంతాల్లో ఈ తరహా మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం స్వయంగా ఈ ప్రాజెక్టుపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా..
అటు ప్రభుత్వానికి, ఇటు జీహెచ్ఎంసీకి ఖర్చు లేకుండా బిల్డ్- ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) పద్ధతిలో ఈ మల్టీలెవెల్పార్కింగ్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానంలో ప్రైవేటు సంస్థలే పెట్టుబడి పెట్టి పార్కింగ్కాంప్లెక్స్లను నిర్మిస్తాయి. పదేండ్ల పాటు ఆ సంస్థలే నిర్వహించి, తర్వాత జీహెచ్ఎంసీ అప్పగిస్తాయి. ఇందుకుగాను సదరు సంస్థకు పదేండ్ల పాటు పార్కింగ్ ఫీజును వసూలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
అంతా అడ్వాన్సుడ్ సిస్టమ్
సెన్సార్లు, ఆటోమేటెడ్ లిఫ్ట్ సిస్టమ్స్ వంటి టెక్నాలజీతో వాహనాలను తక్కువ సమయంలో పార్క్ చేసే వీలుంటుంది. కేబీఆర్ పార్కు వద్ద 405 చదరపు మీటర్లలో 72 కార్లను పార్క్చేసుకునేలా కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. దీన్ని నవనిర్మాణ్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ విధానంతో మరో 30 చోట్ల అందుబాటులోకి తీసుకువస్తే రద్దీగా ఉండే ప్రాంతాల్లో పార్కింగ్సమస్యతో పాటు ట్రాఫిక్ఇబ్బందులు తొలగనున్నాయి.
