- గ్రామీణ క్రీడాకారులను జాతీయస్థాయికి తీసుకెళ్తాం
- గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అటవీ పర్మిషన్లకు ప్రయత్నాలు
- మంచిర్యాల జిల్లాలోని సమ్మక్క, సారలమ్మ జాతర్లలో పూజలు చేసిన మంత్రి
కోల్‌బెల్ట్/కోటపల్లి/చెన్నూరు,వెలుగు: సింగరేణిలో కొత్త బొగ్గు గనులకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కొత్త బొగ్గు గనులు తవ్వకాలతోనే సింగరేణి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్(క్యాతనపల్లి), చెన్నూరు, కోటపల్లి మండలాల్లో మంత్రి పర్యటించారు.
మందమర్రి ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్పాలవాగు ఒడ్డున, చెన్నూరు, కోటపల్లి మండలాల్లోని అక్కెపల్లి, మల్లంపేటలో సమ్మక్క,సారలమ్మ జాతరల్లో పాల్గొన్నారు. మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్వాసిరెడ్డి సీతారామయ్య, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌తో కలిసి మంత్రి వనదేవతలకు పూజలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. రామకృష్ణాపూర్లో ఓసీపీ రెండోఫేజ్ను అందుబాటులోకి తీసుకొస్తామని, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గతంలో కొత్త గనులు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుందన్నారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి సింగరేణి వేలంలో పాల్గొని కొత్త బొగ్గు బ్లాక్‌లను పొందేలా పర్మిషన్తీసుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చెన్నూరు అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
ఎమ్మెల్యే అయిన తర్వాత రూ.100కోట్ల నిధులతో అమృత్‌స్కీమ్ ద్వారా మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు సప్లై చేయిస్తున్నామన్నారు. క్యాతనపల్లిలో ఆర్వోబీ పూర్తిచేసి లైటింగ్సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రూ.50కోట్లతో ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేసి, కొత్త కోర్సులపై శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
సమ్మక్కసారలమ్మ అమ్మవార్ల దీవెనలు, ఆశీస్సులు రాష్ట్ర ప్రజందరికి ఉండాలని మంత్రి కోరుకున్నట్టు చెప్పారు. కోటపల్లిలో కాంగ్రెస్‌నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్తండ్రి దివంగత రామకృష్ణయ్య- పురాణం, శ్యాంసుందర్‌రావు స్మారకార్థం నిర్వహించిన కోటపల్లి ప్రీమియర్లీగ్సీజన్క్రికెట్టోర్నమెంట్ విన్నర్ కోటపల్లి, రన్నరప్గొర్లపల్లి టీమ్ లకు మంత్రి బహుమతులు అందించారు.
గ్రామాల్లోని ప్రతిభావంతులైన క్రికెట్లను జాతీయస్థాయిలో వెలుగులోకి తీసుకరావడమే తమ లక్ష్యమన్నారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్డిస్ర్టిక్ట్ టీ 20 క్రికెట్లీగ్ను విజయవంతంగా చేపట్టామన్నారు. కోటపల్లి మండలంలో గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ పర్మిషన్ల క్లియరెన్స్ కోసం కృషి చేస్తున్నామన్నారు.
