వీధి కుక్కల స్వైరవిహారం..30 మందిపై దాడి

వీధి కుక్కల స్వైరవిహారం..30 మందిపై దాడి

జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్ట ణంలోని పలుచోట్ల ఆదివారం 30 మందిని కుక్కలు కరిచాయి. పట్టణంలోని నెహ్రు పార్క్, గిర్నిగడ్డ, గుండ్లగడ్డ, బీరప్పగడ్డ, సూర్యాపేట రోడ్, బ్యాగపరం, ప్రెస్టన్కాలనీ ప్రాంతాల్లో వీధి కుక్కలు చిన్నారులను కరవ డంతో తల్లిదండ్రులు వారిని జిల్లా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 23 మందికి ఇంజక్షన్లు చేసి ఇంటికి పంపించారు. కొందరు ప్రైవేట్ హాస్సి టల్లో చూపించుకున్నారు.