సాంబార్ ఇడ్లీలో బల్లి.. 30 మంది స్టూడెంట్స్ ఆస్పత్రిపాలు... 

సాంబార్ ఇడ్లీలో బల్లి.. 30 మంది స్టూడెంట్స్ ఆస్పత్రిపాలు... 

స్కూల్ పిల్లలు తింటున్న సాంబార్ ఇడ్లిలో బల్లి పడిన ఘటన ముమాబిలోని ధారావిలో చోటు చేసుకుంది. ధారావిలోని కామరాజ్ మెమోరియల్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ లో పిల్లలు లంచ్ చేస్తుండగా జరిగిన ఈ సంఘటనలో 30మంది స్కూల్ పిల్లలు ఆసుపత్రిపాలయ్యారు. షాహు నగర్ పోలీసుల కధనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పిల్లలకు లంచ్ బాక్స్, బ్రేక్ ఫాస్ట్ అరేంజ్ చేయలేని పేరెంట్స్ పిల్లలలు ఫుడ్ అరేంజ్ చేసేలా స్కూల్ కి పక్కనే ఉన్న జేపీ హోటల్ తో టై అప్ అయ్యారు. ఆ హోటల్ నుండి వచ్చిన సాంబార్ లోనే బల్లి పడింది.

పిల్లలంతా మధ్యాహ్నం లంచ్ చేస్తుండగా ఒక పిల్లడు సాంబార్ లో బల్లి తేలడం చూసి పక్కకు వెళ్లి నోట్లో వేలు పెట్టి వాంతి చేసుకునే ప్రయత్నం చేశాడు. అది చుసిన మిగతా పిల్లలు కూడా అతడినే ఫాలో అయ్యారు. ఆ వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం పిల్లలందరిని దగ్గరలో ఉన్న ఆయుష్ హాస్పిటల్ కి తరలించారు. అదృష్టవశాత్తు పిల్లలెవరికీ ఫుడ్ పాయిజన్ కాకపోవటంతో పిల్లలందరినీ తల్లిదండ్రులతో ఇళ్లకు పంపారు.

పిల్లలు తిన్న ఫుడ్ శాంపిల్స్ ను ఏఫ్డీయే అధికారులు టెస్టింగ్ కోసం ల్యాబ్ కి పంపారు. టెస్ట్ రిపోర్ట్స్ ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు సౌత్ జోన్ డీసీపీ తేజస్వి. అయితే, పిల్లల తల్లిదండ్రుల నుండి తమకు ఎలాంటి కంప్లైంట్ రాలేదని ఆయన అన్నారు.