పోస్టల్ శాఖలో 30 వేలకు పైగా ఉద్యోగాలు..టెన్త్ పాసైతే చాలు..

పోస్టల్ శాఖలో 30 వేలకు పైగా ఉద్యోగాలు..టెన్త్ పాసైతే చాలు..

పదవ తరగతి అర్హతతో దాదాపు 30 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఇండియా పోస్ట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 


లాస్ట్ డేట్ ఆగస్ట్ 23
మొత్తం 30041 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak GDS) పోస్ట్ లను భర్తీ చేయడానికి ఇండియా పోస్ట్ సన్నా హాలు చేస్తోంది. ఈ పోస్ట్లకు అర్హత కేవలం పదవ తరగతి పాస్ కావడమే. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్ట్23 లోగా ఆన్లైన్ లో indiapostgdsonline.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆ తరువాత ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 26 వరకు తమ అప్లికేప్లిషన్లో తప్పొప్పులను సరి చేసుకునే అవకాశం ఉంటుంది.

విద్యార్హతర్హ లు, ఇతర నిబం ధనలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30,041 గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak GDS) పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఏదైనా గుర్తిం పు పొందిన బోర్డు నుంచి 10 వతరగతి పాస్ అయిన వారు ఈ పోస్ట్లకు అప్లై చేయడానికి అర్హులు. అయతే వారు 10వ తరగతిలో గణితం, ఇంగ్లీష్,  స్థానిక భాషలో కచ్చితంగా చదివి ఉండాలి. ఈ పోస్ట్లకు అప్లై చేయడానికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు రూ. 100 అప్లికేప్లిషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్ విమన్, దివ్యాంగులు ఫీజు చెల్సించాల్సిన అవసరం లేదు. 

ALSO READ:దేవుడికి విద్యకు లింక్.. ఉత్కంఠ రేపుతున్న ఓ మై గాడ్-2 ట్రైలర్