కొండారెడ్డి పల్లెకు 300 ఇందిరమ్మ ఇండ్లు..ప్రత్యేక కోటా కింద మంజూరు

కొండారెడ్డి పల్లెకు 300 ఇందిరమ్మ ఇండ్లు..ప్రత్యేక కోటా కింద మంజూరు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్​ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలోని కొండా రెడ్డి పల్లెకు  ప్రభుత్వం 300 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం హౌసింగ్ శాఖ సెక్రటరీ వీపీ. గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎస్ఆర్​క్యూ ( స్టేట్ రిజర్వ్ కోటా ) కింద ఈ ఇండ్లను కేటాయించినట్టు సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, సీఎం గ్రామంలో రోడ్ల విస్తరణ చేస్తున్నందున పలువురి ఇండ్లు డ్యామేజ్ అవుతుండటంతో వారి కోసం అదనపు ఇండ్లు మంజూరు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.