తాగి బండి నడిపి దొరికిపోయిన్రు..పట్టుబడ్డ వారిలో 82శాతం యువతే

తాగి బండి నడిపి దొరికిపోయిన్రు..పట్టుబడ్డ వారిలో 82శాతం యువతే
  • హైదరాబాద్​లో 3 వేల డ్రంకెన్ డ్రైవ్ కేసులు
  • 2,435 బైక్స్, 486 కార్లు సీజ్‌‌.. పట్టుబడ్డ వారిలో 82 శాతం యువతే

హైదరాబాద్, వెలుగు : డిసెంబర్ 31 రాత్రి గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌ పరిధిలో 3 వేల డ్రంకెన్ డ్రైవ్‌‌ కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పక్కా ప్రణాళికతో సెలబ్రేషన్స్ ఎక్కువగా జరిగే గ్రేటర్‌‌‌‌ పరిధిలో 260 టీమ్స్‌‌తో చెక్‌‌ పాయింట్స్‌‌ ఏర్పాటు చేశారు. అయితే, డ్రంకెన్ డ్రైవ్‌‌, డ్రగ్స్‌‌ డిటెక్షన్ టెస్టులు చేస్తామన్న  పోలీసుల హెచ్చరికలు సత్ఫలితాలనిచ్చాయి. గతేడాది నమోదైన కేసుల కంటే ఈ ఏడాది కేసుల శాతం తగ్గింది. హైదరాబాద్, సైబరాబాద్‌‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గతేడాది 3,172 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 3,001 కేసులు నమోదయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా న్యూ ఇయర్ వేడుకలు ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారించే క్రమంలో ప్రతి ఏటా డిసెంబర్ 31న రాత్రి సమయాల్లో పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే ఈ ఏడాది మరింత పటిష్టవంతగా తనిఖీలు చేశారు.  డ్రంకెన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌, ర్యాష్‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌, పబ్లిక్ న్యూసెన్స్‌‌‌‌‌‌‌‌, రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టారు. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటల వరకు వెహికల్స్​ చెకింగ్‌‌‌‌‌‌‌‌ చేశారు. టీ న్యాబ్‌‌‌‌‌‌‌‌ పోలీసులు డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ డిటెక్షన్‌‌‌‌‌‌‌‌ తనిఖీలు నిర్వహించారు. పబ్స్‌‌‌‌‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ సప్లయర్స్‌‌‌‌‌‌‌‌పై నిఘా పెట్టారు. పబ్స్‌‌‌‌‌‌‌‌, బార్లు, ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా జరిగిన ఏరియాల్లో మెయిన్ రోడ్స్‌‌‌‌‌‌‌‌పై డ్రంకెన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌ పాయింట్స్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది తక్కువ కేసులు నమోదయ్యాయి. బాలానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మినహా ఎక్కడా తీవ్రమైన ప్రమాదాలు చోటుచేసుకోలేదు.

బీఏసీ 500 కంటే ఎక్కువ

డ్రంకెన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ చెకింగ్స్​లో ఇద్దరు యువతులు సహా మొత్తం 3,001 మంది పట్టుబడ్డారు. సైబరాబాద్‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 300 నుంచి 500 కంటే బీఏసీ లెవల్స్‌‌‌‌‌‌‌‌ ఎక్కువ వచ్చిన వారు 51 మంది దొరికారు. 21 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారే అత్యధికంగా పోలీసులకు చిక్కారు. డ్రంకెన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లో దొరికిన వారి వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు సీజ్ చేశారు. వెహికల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ, డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. వెహికల్‌‌‌‌‌‌‌‌, బ్రీత్‌‌‌‌‌‌‌‌ ఎనలైజ్‌‌‌‌‌‌‌‌తో పాటు డ్రంకెన్ డ్రైవర్ల ఫొటోలు తీసుకున్నారు. గోషామహల్‌‌‌‌‌‌‌‌, బేంగంపేట్‌‌‌‌‌‌‌‌, ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సెంటర్స్‌‌‌‌‌‌‌‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం సంబంధిత కోర్టుల్లో హాజరుకావాలని సమాచారం ఇచ్చారు.

ముగ్గురు పోలీస్ కమిషనర్ల మానిటరింగ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌‌‌‌‌, రాచకొండ కమిషనర్లు శ్రీనివాస్​ రెడ్డి, అవినాష్ మహంతి, సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు బందోబస్తును స్వయంగా పర్యవేక్షించారు. లా అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌, ట్రాఫిక్ పోలీసుల చెక్ పాయింట్స్‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌, చార్మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓయూ, కేబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌, బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లలో సీపీ శ్రీనివాస్​ రెడ్డి కేకులు కట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఉప్పల్, నాగోల్ చౌరస్తాల్లో రాచకొండ సీపీ సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలు చోట్ల అర్ధరాత్రి రోడ్లపై న్యూసెన్స్ చేసే వారికి కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి ఇండ్లకు పంపించారు. ఓల్డ్‌‌‌‌‌‌‌‌ సిటీలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన 15 మందిని పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వెహికల్స్​

కమిషనరేట్    బైక్స్     కార్లు    ఆటోలు    భారీ వాహనాలు    మొత్తం కేసులు
హైదరాబాద్    1,066     135        42                 0                                1,243
సైబరాబాద్     938       275        21                 7                                 1,241
రాచకొండ       431        76          10                 0                                 517
మొత్తం          2,435       486       73                  7                                 3001