
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా..వైరస్ తో 21 మంది మరణించారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 5,56,320కు పెరిగిందని..ఇప్పటివరకు కరోనాతో 3,146 మంది చనిపోయారని చెప్పింది. కొత్తగా 4,693 మంది కోలుకోగా..రికవరీల సంఖ్య 5,13,968కు చేరిందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206 యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ.