- ఉమ్మడి జిల్లాలో ముగిసిన మూడో దశ నామినేషన్ల ప్రక్రియ
- హైకోర్టు ఆదేశాలతో నిలిచిన పెద్దపల్లి జిల్లా పెద్దంపేట జీపీ ఎన్నిక
- రెండో దశ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మూడో దశలో ఎన్నికలు జరిగే 408 పంచాయతీల్లో 3,064 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వ్యాలిడ్, ఇన్ వ్యాలిడ్ నామినేషన్లను వేరు చేసే ప్రక్రియను ఆఫీసర్లు శనివారం పూర్తిచేశారు. అలాగే రెండో దశలో ఎన్నికలు జరిగే జీపీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం ముగియడంతో.. బరిలో నిలిచిన అభ్యర్థులకు రిటర్నింగ్ ఆఫీసర్లు గుర్తులు కేటాయించారు. దీంతో తమకు వచ్చిన గుర్తులతో శనివారం సాయంత్రం నుంచే అభ్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో 331 నామినేషన్లు రిజెక్ట్..
కరీంనగర్ జిల్లాలో మూడో దశలో 111 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా.. శుక్రవారం సాయంత్రం నామినేషన్ల గడువు ముగిసింది. సర్పంచ్ అభ్యర్థులుగా మొత్తం 912 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. శనివారం స్ర్కూటినీ అనంతరం 581 నామినేషన్లను ఆమోదించగా.. 331 రిజెక్ట్ అయ్యాయి. ఇల్లందకుంట మండలం 18 గ్రామాల్లో 113, హుజూరాబాద్ మండలం 20 గ్రామాల్లో 97, జమ్మికుంట మండలం 20 గ్రామాలకు గానూ 112, వి.సైదాపూర్ మండలం 27 గ్రామాల్లో 130, వీణవంక మండలం 26 గ్రామాలకు గానూ 129 నామినేషన్లు ఆమోదం పొందాయి.
పెద్దపల్లిలో 91 జీపీల్లో645 నామినేషన్లు
పెద్దపల్లి, వెలుగు: మూడో విడత సర్పంచ్ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు, ఓదెల, పెద్దపల్లి, సుల్తానాబాద్మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలాల పరిధిలో 91 జీపీలు ఉండగా.. 645 నామినేషన్లు వేశారు. 852 వార్డులకు గానూ 2,365 నామినేషన్లు వేశారు. ఎలిగేడు మండలంలో 12 జీపీలకు 53, ఓదెలలో 22 గ్రామాలకు 156, పెద్దపల్లిలో 30 గ్రామాలకు 207, సుల్తానాబాద్‌లో 27 జీపీలకు 200 నామినేషన్లు దాఖలయ్యాయి.
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో మూడో విడత నామినేషన్లకు సంబంధించి 119 సర్పంచ్ స్థానాలకు 873 నామినేషన్లను ఆమోదించినట్లు అధికారులు ప్రకటించారు. బుగ్గారం మండలంలోని 10 గ్రామాలకు గానూ 90 నామినేషన్లు, ధర్మపురి 25 గ్రామాలకు గానూ150, ఎండపల్లిలో 15 జీపీలకు గానూ 107, గొల్లపల్లిలో 27 జీపీలకు గానూ203, పెగడపల్లిలో 23 గ్రామాలకు గానూ 196, వెల్గటూర్‌లో 19 జీపీలకు గానూ 127 నామినేషన్లు నమోదయ్యాయి.
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న జిల్లాలో మూడో విడతలో గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో 87 గ్రామ పంచాయతీలకు గానూ 634 నామినేషన్లు దాఖలయ్యాయి. గంభీరావుపేటలో 22 జీపీలకు గానూ 161, ముస్తాబాద్‌లో 22 గ్రామాలకు 171, వీర్నపల్లిలో 17 జీపీలకుగానూ 98, ఎల్లారెడ్డిపేటలో 26 గ్రామాలకు గానూ 204 నామినేషన్లు దాఖలయ్యాయి.
జిల్లా జీపీలు నామినేషన్లు
కరీంనగర్ 111 581
పెద్దపల్లి 91 645
జగిత్యాల 119 873
రాజన్న సిరిసిల్ల 87 634
మొత్తం 408 3064
