- ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
పద్మారావునగర్, వెలుగు : పద్మారావునగర్ స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సోమవారం 30వ పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామీజీ ఆరాధన సభ నిర్వహించనున్నట్లు స్కందగిరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. స్కందగిరి నుంచి పద్మారావు నగర్ లోని కంచి కామకోటి స్వరాజ్ ప్రెస్ వరకు రథోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం పుస్తకావిష్కరణ
విద్వాత్ సన్మాన కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ శంకరాచార్య, రాష్ర్ట ఐటీ మంత్రి డి.శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరు అవుతారని తెలిపారు. మీడియా సమావేశంలో కంచి కామకోటి శ్రీకార్య నిర్వహణ అధికారి చల్లా విశ్వనాథ శాస్త్రి, స్కందగిరి ఆలయ మేనేజింగ్ ట్రస్టీ కృష్ణన్ రాజమణి, సిబ్బంది పాల్గొన్నారు.
