
జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేశ్వాన్ నుండి కిష్త్వారకు ప్రమాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈప్రమాదంలో 31 మంది చనిపోగా..13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీసినట్లు జమ్మూ ఐజీ ఎంకే సిన్హా తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణం బస్సులో పరిమితికి మించి ప్రయాణికులుండటమే కారణమంటున్నారు.