మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ కు 31 వేల అప్లికేషన్లు

మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ కు 31 వేల అప్లికేషన్లు
  • మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ కు 31 వేల అప్లికేషన్లు
  • 22 వరకు దరఖాస్తుకు అవకాశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ టెస్టుకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకూ 31,048 దరఖాస్తులు అందినట్టు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ రమణకుమార్ తెలిపారు. వీటిలో ఆరో తరగతిలో సీట్ల కోసం 18,781 అప్లికేషన్లు రాగా, ఏడో తరగతి నుంచి పదో తరగతిలోని సీట్ల కోసం12,267 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. 

ఈ నెల 22 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. స్టేట్​లో 194 మోడల్ స్కూళ్లు ఉండగా, వాటిలో  ఆరో తరగతిలో ఒక్కో స్కూల్​లో వంద సీట్లను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 7న ఎంట్రెన్స్ టెస్టు ఉంటుందని రమణ కుమార్ స్పష్టం చేశారు.