తెలంగాణలో 32 మంది IPS అధికారుల బదిలీ

తెలంగాణలో 32 మంది IPS అధికారుల బదిలీ

 తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ రామకృష్ణ రావు.అడిషనల్ డీజీగా జయేంద్ర సింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా పరిమళ   నూతన్ జాకబ్,  పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా చేతన్ మైలబత్తుల, తెలంగాణ యాంటీ నార్కో బ్యూరో ఎస్పీగా గిరిధర్,  హైదరబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ప్రభాకర్ లను బదిలీ చేసింది ప్రభుత్వం

 ఐపీఎస్ ల కొత్త పోస్టులు

  • టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా వైభవ్‌ గైక్వాడ్‌
  • సీఐడీ డీజీగా పరిమళ నూతన్‌
  • పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎం. చేతన
  • సౌత్‌జోన్‌ డీసీపీగా కిరణ్‌ ఖార్గే
  • ఏడీజీ పర్సనల్‌గా చౌహాన్‌
  • నార్కొటిక్‌ ఎస్పీగా పద్మ
  • గవర్నర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్
  • పెద్దపల్లి డీసీపీ రామిరెడ్డి
  • భువనగరి అడిషనల్ ఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి
  • మహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డి
  • వనపర్తి ఎస్పీగా సునీత
  • మహబూబాబాద్‌ ఎస్పీగా శబరీష్‌
  • మల్కాజ్‌గిరి డీసీపీగా శ్రీధర్‌
  • వికారాబాద్‌ ఎస్పీగా స్నేహ మిశ్ర
  • నాగర్‌ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్‌ పాటిల్‌
  • భూపాలపల్లి ఎస్పీగా సంకేత్‌
  • భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా అవినాశ్ కుమార్
  • ఏటూరు నాగారం ఏఎస్పీగా మనన్ భట్

  •