టీచర్స్ అన్నాక పనిష్మెంట్ ఇవ్వడం కామన్. నోట్స్ రాయలేదనో, సరిగ్గా చదవటం లేదనో, క్లాస్ డిస్టర్బ్ చేస్తు్న్నారనో, టైమ్ కు రాలేదనో.. ఏదో ఒక సమస్యపై పనిష్మెంట్ ఇస్తుంటారు. అది సుతిమెత్తగా, విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేదిగా ఉంటే పర్లేదు కానీ.. అది మరణ దండనగా మారితేనే అసలైన సమస్య. మధ్యప్రదేశ్ లో ఓ టీచర్ చాదస్తానికి స్టూడెంట్ ప్రాణాలు తీసుకుంది. టీచర్ ఎలా టార్చర్ చేసిందో, ఎందుకు సూసైడ్ చేసుకుందో అన్నీ వివరంగా రాసి చనిపోయింది స్టూడెంట్.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రెవా జిల్లాలో ఫస్ట్ ఇయర్ (11వ తరగతి) స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదంగా మిగిలింది. తన టీచర్ టార్చర్ చేయడం వల్లనే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసింది.
17 ఏళ్ల ఆ విద్యార్థి ఇంట్లో తన ఇంట్లో 2025, నవంబర్ 16వ తేదీన ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ASP ఆర్తి సింగ్ తెలిపారు. స్టూడెంట్ నోట్ బుక్ లో ఆమె చేతితో స్వయంగా రాసిని నోట్ ఒకటి దొరికినట్లుగా తెలిపారు.
ALSO READ : ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సీవీ ఆనంద్ ట్వీట్ ఏం చెప్తున్నదంటే..
సూసైడ్ నోట్లో ఏముంది..?
తన టీచర్ టార్చర్ వల్లనే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ లో బాధితురాలు (17) రాసింది. చేయి పట్టుకుని కట్టెతో దారుణంగా కొట్టిందని, బాధ భరించలేక పిడికిలి మూస్తే.. పిడికిలి తెరవాలని దారుణంగా కొట్టినట్లు పేర్కొంది. రెండు వేళ్ల మధ్య పెన్ను పెట్టి పైనుంచి కొట్టినట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. పనిష్మెంట్ పేరున మరింత టార్చర్ చేసినట్లు స్టూడెంట్ తెలిపింది.
బెంచ్ లో కూర్చుని ఉండగా.. తన టీచర్ చేయి లాగి కొట్టడం మొదలుపెట్టిందని..నోట్ లో తెలిపింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. తన కూతురు ఇంటి దగ్గర ప్రశాంతంగానే ఉందని.. స్కూల్ లో ఎవరో టార్చర్ చేసినందుకే ఆత్మ హత్యకు పాల్పడినట్లు ఆమె పేరెంట్స్ తెలిపారు. తమ కూతురు మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎదిగిన బిడ్డ లేని లోటు ఇపుడు ఎవరు తీరుస్తారని వాపోతున్నారు. సూసైడ్ వెనకాల ఉన్న కారణలేంటో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
