రాజస్థాన్​లో కొవాగ్జిన్ వ్యాక్సిన్ టీకాల దొంగతనం

రాజస్థాన్​లో కొవాగ్జిన్ వ్యాక్సిన్ టీకాల దొంగతనం

రాజస్థాన్​లో కరోనా వ్యాక్సిన్లను కొంతమంది దుండగులు ఎత్తుకెళ్లారు. కోల్డ్​స్టోరేజ్​నుంచి వ్యాక్సిన్​సెంటర్​కు తరలిస్తుండగా 320 కొవాగ్జిన్​డోసులను దొంగిలించారు. జైపూర్ శాస్త్రినగర్ లోని కన్వతియా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఈ ఘటన జరిగింది. 320 డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్లు మిస్ అయినట్టు ఆస్పత్రి అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'మంగళవారం రాత్రి కరోనా వ్యాక్సిన్ డోసులు చోరీకి గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాం. డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీ కూడా చేపట్టాం' అని జైపూర్ సీఎంహెచ్ఓ నరోత్తమ్ శర్మ వెల్లడించారు. 32 వయల్స్ (320 డోసులు) కొవాగ్జిన్ వ్యాక్సిన్ చోరీకి గురైనట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్షం బీజేపీ మండిపడింది. రాజస్థాన్ సర్కారు నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణ అని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సతీశ్ పూనియా ఆరోపించారు.