
భారత రవాణా వ్యవస్థలో అత్యధికంగా ప్యాసెంజర్లు వినియోగించేది రైల్వే సేవలనే. కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్లాలన్నా మొదటగా రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు మిడిల్ క్లాస్ జనం. అయితే ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే శాఖ అప్డేట్ కానందున కోట్ల మంది నష్టపోయినట్లు తెలిసింది. బుకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగా టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ మూడున్నర కోట్ల మంది ప్రయాణం చేయలేక నష్టపోయినట్లు ఆర్టీఏ యాక్టివిస్ట్ ద్వారా తెలిసింది.
గత ఆర్థిక సంవత్సరం (2024-25) 3 కోట్ల 27 లక్షల మంది ప్యాసెంజర్లు రైలు ప్రయాణం చేయలేక నష్టపోయారు. టికెట్ బుక్ చేసుకున్ననాటి నుంచి ప్రయాణం చేయాల్సిన రోజు వరకు బుకింగ్ కన్ఫామ్ చేయకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. బుకింగ్స్ ఫైనల్ చార్ట్ పెట్టే ముందు వరకు కూడా టికెట్లు కన్ఫమ్ కాకుండా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం.
మధ్యప్రదేశ్ నీముచ్ కు చెందిన ఆర్టీఐ (RTI-Right To Information Act) యాక్టివిస్ట్ చంద్రశేఖర్ గౌర్ వేసిన ఆర్టీఐ ద్వారా ఈ విషయాలు బయటపడ్డాయి. గత ఐదేళ్ల నుంచీ ప్రతీ ఏటా టికెట్లు బుక్ కాకపోవడం వలన జర్నీ చేయలేని ప్యాసెంజర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. రైలు ప్రయాణానికి ఉన్న డిమాండ్ కు, కన్ఫమ్ అయిన సిట్లకు మధ్య మిస్ మ్యాచ్ ఉండటం వలన ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన చెబుతున్నారు. దీని వలన సాధారణ ప్యాసెంజర్లు తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు.
ఆర్టీఐ ద్వారా టికెట్ బుకింగ్ కాని ప్రయాణికుల సంఖ్య ఏటా ఎలా పెరుగుతుందో బయటకు వచ్చింది. 2023-24 లో మూడు కోట్ల మంది ప్రయాణికులు జర్నీ క్యాన్సిల్ అయ్యింది. అదే 2022-23 లో 2 కోట్ల 72 లక్షల మంది, 2021-22లో కోటీ 65 లక్షల మంది టికెట్ కన్ఫమ్ కాకపోవడం వలన నష్టపోయారు.
►ALSO READ | ఓ టీచర్ చేయాల్సిన పనేనా ఇది..చిన్నారి ప్రైవేట్ పార్ట్స్పై ఏం చేసిందో చూడండి
ఒకవైపు రైల్వే సేవలను ఆధునీకరిస్తున్నమని, ప్రభుత్వం, రైల్వే శాఖ ప్రకటనలు చేస్తున్నప్పటికీ గత ఐదేళ్లుగా రైల్వే బుకింగ్స్ వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నారు. రైల్వే ప్రయాణానికి ఉన్న డిమాండ్ ను రైల్వే శాఖ అందుకోలేకపోతోందని ఆర్టీఐ యాక్టివిస్త్ ఆవేదన వ్యక్తం చేశారు.
బుకింగ్ ప్రాసెస్ లో వస్తున్న అవకతవకలను కట్టడి చేసేందుకు IRCTC 2 కోట్ల 50 లక్షల ఐడీ లను డీయాక్టివేట్ చేసింది. ఫేక్ అనిపించిన ఐడీలను డీయాక్టివేట్ చేయడం వలన టికెట్ బుకింగ్స్ లో జరుగుతున్న అవినీతిన అరికట్టవచ్చునని ఐఆర్టీసీ చెబుతోంది. దీనితో పాటు వెయిట్ లిస్ట్ లో ఉన్న టికెట్స్ ను ప్యాసెంజర్లు రైలు ప్రారంభమయ్యే 24 గంటల ముందు తెలుసుకునేలా కొత్త రూల్ తీసుకొచ్చింది. గతంలో నాలుగు గంటల ముందు మాత్రమే ఉండేది. ఈ చర్యలు ప్యాసెంజర్లకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ.. దేశ వ్యాప్తంగా ప్రయాణికుల బుకింగ్ కష్టాలు మాత్రం ఈ చిన్న మార్పులతో తీరవని అంటున్నారు.