మణిఫూర్లో భారీ సంఖ్యలో ఆయుధాలు సీజ్

మణిఫూర్లో భారీ సంఖ్యలో ఆయుధాలు సీజ్
  • 328 వెపన్లు, 9300 రౌండ్ల మందుగుండు సామగ్రి స్వాధీనం

ఇంఫాల్: గత మూడేండ్లుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్​లో పోలీసులు శనివారం భారీఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 328 ఆయుధాలు, 9300 రౌండ్ల వివిధ మందుగుండు సామగ్రిని రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో సీజ్ చేశారు. ఇంపాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కాక్చింగ్ లో మారణాయుధాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ నుంచి  సమాచారం అందడంతో పోలీసులు సోదాలు చేసి వాటిని రికవరీ చేశారు. 

మణిపూర్  పోలీసులు, ఆర్మీ, అస్సాం రైఫిల్స్, బీఎస్​ఎఫ్​, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఈ విషయాన్ని మణిపూర్ పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రికవరీ చేసుకున్న ఆయుధాలన్నీ ఆ జిల్లాల సరిహద్దుల్లోనే అని చెప్పారు. 328 ఆయుధాల్లో 151 సెల్ఫ్ లోడింగ్  రైఫిల్స్, 73 రైఫిల్స్, 65 ఇన్సాస్  రైఫిల్స్, 12 లైట్ మెషీన్ గన్స్, 6 ఏకే సిరీస్  రైఫిల్స్, 5 కార్బైన్స్, 6 పిస్టళ్లు, ఇంకా చాలా రకాల ఆయుధాలు ఉన్నాయని పోలీసు అధికారులు వివరించారు.