శంషాబాద్ ఎయిర్పోర్టులో 33లక్షల బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్టులో 33లక్షల బంగారం పట్టివేత

బంగారం అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చేందుకు కొందరు కొత్త కొత్త మార్గాలు కనిపెడుతూ అధికారులకే సవాల్ విసురుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 533 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి మొబైల్ ఫోన్ కవర్లో బంగారాన్ని దాచి తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ బంగారం విలువ రూ. 33లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.