Chiranjeevi Box Office: ఫస్ట్ డే కలెక్షన్లతో దుమ్మురేపిన మెగాస్టార్.. ‘మన శంకరవరప్రసాద్‌ గారు’తో కెరీర్ హయ్యెస్ట్ ఓపెనింగ్!

Chiranjeevi Box Office: ఫస్ట్ డే కలెక్షన్లతో దుమ్మురేపిన మెగాస్టార్.. ‘మన శంకరవరప్రసాద్‌ గారు’తో కెరీర్ హయ్యెస్ట్ ఓపెనింగ్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సోమవారం (జనవరి 12) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకెళ్లింది. ప్రీమియర్లు మరియు తొలి రోజు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, చిరంజీవి కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్గా కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఘన విజయాన్ని మేకర్స్ (జనవరి 13న) అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. దానితో పాటు ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ మెగా ఫ్యాన్స్లో జోష్ నింపుతుంది.

“మన శంకరవరప్రసాద్ గారు బాక్స్ఆఫీస్ బద్దలుకొట్టేసారు. ప్రపంచవ్యాప్తంగా (ప్రీమియర్లు + మొదటి రోజు) కలిపి రూ.84 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ అద్భుతమైన వసూళ్లతో మెగాస్టార్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. అన్ని చోట్లా ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్…‘మన శంకరవరప్రసాద్ గారు’ సంచలనం!”అని మేకర్స్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్‌ మెగా ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు, సోషల్ మీడియాలో సంబరాలు.. అన్ని చోట్లా మెగా మేనియా కనిపిస్తోంది. చిరంజీవి పవర్, అనిల్ రావిపూడి స్టైల్ ఎంటర్టైన్మెంట్, ఫెస్టివల్ సీజన్ కలిసి ‘మన శంకరవరప్రసాద్ గారు’ను ఈ స్థాయిలో ఓపెన్ చేయించాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఇండస్ట్రీ ట్రాకింగ్ వెబ్ సైట్ సాక్నిల్క్ ప్రకారం, సినిమా ఇండియాలో రూ.38 కోట్లకి పైగా నెట్ సంపాదించినట్లు  సినీ వర్గాలు వెల్లడించాయి. అందులో స్పెషల్ ప్రివ్యూస్ (ఆదివారం Jan11) ద్వారా రూ.8.6 కోట్లు, నిన్న సోమవారం రూ.28.5 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు సాధించింది.

అమెరికాలో ప్రత్యేక ప్రీమియర్ షోస్ USD 1.25M–1.5M రేంజ్‌లో రికార్డ్ సెట్ చేసింది. తొలిరోజు నార్త్ అమెరికాలో $1.7 మిలియన్స్ డాలర్స్ అందుకుంది. అంటే తెలుగులో రూ.15.33కోట్లు సాధించి మెగా మేనియా నిరూపించింది. ఓవర్సీస్ లో మరింత దూకుడు కనబరిచింది. 

సినిమా విడుదలతో పాటు సోషల్ మీడియాలో అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. చిరంజీవి–నయనతార, అనిల్ రావిపూడి కనక్షన్ ప్రేక్షకులను ఆకర్షించింది. వీటితోడు చిరంజీవి నటన, కామెడీ ఎలిమెంట్స్, స్టైలిష్ డ్యాన్స్ వంటి అంశాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. మెగా ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ సినీప్రేక్షకుల నుండి విశేషంగా పాజిటివ్ టాక్ పెరుగుతోంది.

ఈ సినిమా సంక్రాంతి పండుగ సీజన్‌లో రిలీజై పెద్ద అంచనాలతో రావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే, చిరంజీవి నటనకు మంచి ప్రశంసలు రాగా, కానీ కథ, స్క్రీన్‌ప్లే పై మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. అయినా కూడా, సోమవారం రిలీజై.. తక్కువ స్క్రీన్లతో రూ.44.25 కోట్లు వసూలు చేయడం బలమైన ఓపెనింగ్‌గా ట్రేడ్ వర్గాలు పరిగణిస్తున్నాయి. 

చిరు గత సినిమాల కంటే భారీ ఓపెనింగ్.. 

చిరంజీవి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా ఓపెనింగ్ మరింత బలంగా ఉంది. భోళా శంకర్ (2023) – తొలి రోజు ఇండియాలో ₹19.15 కోట్ల నెట్, రూ.33 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వాల్తేరు వీరయ్య తొలి రోజు రూ.49 కోట్లకి పైగా గ్రాస్, 'గాడ్ ఫాదర్'కు రూ. 32.70 కోట్లు, 'ఆచార్య'కు రూ. 52 కోట్లు, 'గాడ్ ఫాదర్'కు రూ. 32.70 కోట్లు, 'ఖైదీ నంబర్ 150'కి రూ. 50.50 కోట్లు వచ్చాయి. 'సైరా నరసింహారెడ్డి' సినిమా మాత్రమే సుమారు రూ.81.4 కోట్ల నుండి రూ.85 కోట్లు అని సమాచారం. అయితే, ఇప్పుడు మన శంకర వరప్రసాద్ రూ.84 కోట్లు అని అధికారికంగా ప్రకటించడం విశేషం.