- మహిళలు 2,57,017, పురుష ఓటర్లు 2,38,421
- కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఓటర్లు 1,49,525 మంది
- పురుషులు 72,488 మంది, మహిళలు 77,006 మంది, ఇతరులు 31 మంది
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల లెక్క తేలింది. సోమవారం సాయంత్రం అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 2,57,017 మంది, పురుషులు 2,38,421 మంది, ఇతరులు45 మంది ఉన్నారు. కొన్ని ఓట్లను అన్‌లాక్ చేశారు.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఈనెల 2న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు రిలీజ్ చేశారు. అభ్యంతరాల స్వీకరణ, 5న పొలిటికల్ పార్టీలతో మీటింగ్ నిర్వహించారు. మ్యాపింగ్ లోపాలు సరిచేయడానికి వార్డ్ ఆఫీసర్లను నియమించగా కలెక్టర్ ఇలా త్రిపాఠి డిప్యూటీ తహసీల్దార్లను పర్యవేక్షకులుగా నియమించారు. లోపాలు సరిచేసి ఫొటోలతో కూడిన ఫైనల్ లిస్టు సోమవారం ప్రకటించారు.
నిజామాబాద్‌లో ..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 3,48,051 ఓటర్లు ఉన్నట్లు కమిషనర్ దిలీప్‌కుమార్ ప్రకటించారు. పురుషులు 1,67,461 కాగా, మహిళలు 1,80,546 మంది, ఇతరులు 44 మంది ఉన్నారు.
బోధన్‌లో..
బోధన్ మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులుండగా ఓటర్లు 69,417 మంది ఉన్నారు. అందులో పురుషులు 33,696 మంది, మహిళలు 35,720 మంది, ఇతరులు ఒకరు ఉన్నట్లు కమిషనర్ జాదవ్రాజు తెలిపారు.
ఆర్మూర్‌లో..
ఆర్మూర్‌లో మున్సిపాలిటీలోని 36 వార్డుల పరిధిలో మొత్తం 63,972 ఓటర్లు ఉన్నారని కమిషనర్ శ్రావణి వెల్లడించారు. అందులో పురుషులు 30,648 మంది, మహిళలు 33,322 మంది ఉన్నారన్నారు.
భీంగల్‌లో
భీంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులుండగా ఫైనల్ లిస్టులో 14,045 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 6,616 మంది కాగా, మహిళలు 7429 మంది ఉన్నట్లు తేల్చారు. డ్రాఫ్ట్ తరువాత ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి ఇతర ప్రాంతానికి చెందిన 144 ఓట్లను తొలగించారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్య తేలింది. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల పరిధిల్లోని 92 వార్డుల్లో వార్డుల వారీగా ఓటర్ లిస్టును అధికారులు ప్రకటించారు. మొత్తం ఓటర్లు 1,49, 525 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 72,488 మంది, మహిళలు 77,006, ఇతరులు 31 మంది ఉన్నారు. ఈ నెల 16న వార్డుల వారీగా ఓటర్ల ఫొటోలతో కంప్లీట్ లిస్టు వెల్లడించనున్నారు.
కామారెడ్డి మున్సిపాలిటీ..
కామారెడ్డి మున్సిపాలిటీలోని 49 వార్డుల్లో 99,313 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 48,389 మంది, మహిళలు 5,907 మంది, ఇతరులు 17 మంది ఉన్నారు.
బాన్సువాడ మున్సిపాలిటీ..
బాన్సువాడ మున్సిపాలిటీలోని 19 వార్డుల్లో మొత్తం ఓటర్లు 24,188 మంది ఉన్నారు. పురుషులు 11,578 మంది, మహిళలు 12,599 మంది, ఇతరులు 11 మంది ఉన్నారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో మొత్తం ఓటర్లు 13,265 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 6,321 మంది, మహిళలు 6,943 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు.
బిచ్కుంద మున్సిపాలిటీ..
బిచ్కుంద మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో మొత్తం ఓటర్లు 12,759 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 6,200 మంది, మహిళలు 6,557 మంది, ఇతరులు 2 ఉన్నారు.
