కుంభమేళా వెళ్లోచ్చిన మహిళతో 33 మందికి కరోనా

కుంభమేళా వెళ్లోచ్చిన మహిళతో 33 మందికి కరోనా

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనికి తోడు కొద్ది రోజుల కిందట ఉత్తరాఖండ్ లో జరిగిన కుంభమేళా ద్వారా వైరస్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. దీనికి సంబంధించి లేటెస్టుగా 33 మందికి కరోనా బారిన పడ్డారు. వారికి వైరస్ సోకడానికి కారణం కుంభమేళాకు వెళ్లొచ్చిన ఓ మహిళ కారణం.

బెంగళూరుకు చెందిన 67 ఏళ్ల మహిళ కుంభమేళాకు వెళ్లి వచ్చింది. కొద్ది తర్వాత ఆమెకు కరోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌పడ్డాయి. టెస్టు చేయించ‌గా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఆ మ‌హిళ‌తో పాటు ఆమె కుటుంబంలోని మ‌రో 18 మందికి క‌రోనా వ్యాపించింది.

ఆ మ‌హిళా కోడ‌లు..వెస్ట్ బెంగ‌ళూరులోని స్పంద‌న హెల్త్‌కేర్ అండ్ రిహాబిలిటేషన్ సెంట‌ర్‌లో సైక్రియాటిస్టుగా ప‌ని చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ద్వారా ఆ సెంట‌ర్‌లో ఉన్న 13 మంది రోగుల‌తో పాటు ఇద్ద‌రు సిబ్బందికి క‌రోనా సోకింది. మొత్తంగా 33 మంది వైరస్ బారిన పడ్డారు. ఈ విష‌యం తెలుసుకున్న అధికారులు.. 67 ఏళ్ల మ‌హిళ ఇంటితో పాటు ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించారు.