4 ఏళ్లలో రూ.33 వేల కోట్ల పెట్టుబడి

4 ఏళ్లలో రూ.33 వేల కోట్ల పెట్టుబడి
  •  ఆయిల్, గ్యాస్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లొరేషన్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్ పెట్టిన వేదాంత

న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్ కంపెనీ కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌  రానున్న మూడు–నాలుగేళ్లలో  4 బిలియన్ డాలర్లు (రూ.33 వేల కోట్లు)  ఇన్వెస్ట్ చేయాలని చూస్తోంది. ఇండియాలోని తన ఆఫ్‌‌‌‌‌‌‌‌షోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆన్‌‌‌‌‌‌‌‌షోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌లలో ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లొరేషన్ (అన్వేషణ), ఇతర  డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ యాక్టివిటీస్‌‌‌‌‌‌‌‌ కోసం ఈ డబ్బులు ఖర్చు చేయనుంది.  ‘ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లొరేషన్, ప్రొడక్షన్ కోసం ప్రతీ ఏడాది బిలియన్ డాలర్లను కంపెనీ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. 

ఇండియా ఆయిల్, గ్యాస్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌లో 25 శాతం వాటాను చేరుకోవడానికి  ఇది మా మొదటి అడుగు. సెకెండ్ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం. వచ్చే  మూడునాలుగేళ్లలో 4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తాం’ అని కెయిర్న్‌‌‌‌‌‌‌‌ ఆయిల్ అండ్ గ్యాస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హితేష్‌‌‌‌‌‌‌‌ వైడ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.  నార్త్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌, కాంబే, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌ బ్లాక్స్‌‌‌‌‌‌‌‌లోని  ఇప్పటికే ఉన్న బావుల్లో  ప్రొడక్షన్ పెంచడంపై ఫోకస్ పెట్టామని చెప్పారు.