ఇంటర్, డిగ్రీ అర్హతతో ఎయిర్​ఫోర్స్​లో 334 జాబ్స్

ఇంటర్, డిగ్రీ అర్హతతో ఎయిర్​ఫోర్స్​లో 334 జాబ్స్

భార‌‌త వాయుసేన ఏటా నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కామ‌‌న్ అడ్మిష‌‌న్ టెస్ట్ (ఏఎఫ్‌‌సీఏటీ) నోటిఫికేష‌‌న్ త్వర‌‌లో వెలువ‌‌డ‌‌నుంది. అప్లికేషన్​ ప్రాసెస్​ జూన్ 1 నుంచి ప్రారంభ‌‌మ‌‌య్యే అవ‌‌కాశం ఉంది. ఈ ఎగ్జామ్​తో ఫ్లయింగ్ డ్యూటీ, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీల్లో క‌‌మిష‌‌న్డ్ ఆఫీస‌‌ర్ పోస్టులు భ‌‌ర్తీ చేయ‌‌నున్నారు.  ఎగ్జామ్​ ప్యాటర్న్​, సెలెక్షన్​ ప్రాసెస్, సిలబస్​ గురించి ఈవారం తెలుసుకుందాం..

ఐఏఎఫ్ ఏటా రెండుసార్లు మే/జూన్​, డిసెంబర్​ నెల‌‌ల్లో ఈ ఎగ్జామ్​ ప్రకటన విడుదల చేస్తుంది. ఇందులో టెక్నిక‌‌ల్‌‌, నాన్‌‌టెక్నిక‌‌ల్ పోస్టులు ఉంటాయి. ప్రస్తుతం రెండో బ్యాచ్ కోసం నోటిఫికేష‌‌న్ రానుంది. దీనిద్వారా ఏఎఫ్‌‌సీఏటీ ఎంట్రీ, ఎన్‌‌సీసీ ఎంట్రీ, ఎన్‌‌సీసీ స్పెష‌‌ల్ ఎంట్రీ, మెటీరియాలజీ ఎంట్రీ చేప‌‌ట్టనున్నారు.

మొత్తం పోస్టులు: 334
1) ఏఎఫ్​ క్యాట్​ ఎంట్రీ
బ్రాంచులు-ఖాళీలు: ఫ్లైయింగ్​–96, గ్రౌండ్​ డ్యూటీ (టెక్నికల్​)– 137, గ్రౌండ్​ డ్యూటీ 
( నాన్​ టెక్నికల్​)– 73
2) ఎన్​సీసీ స్పెషల్​ ఎంట్రీ
బ్రాంచ్​: ఫ్లైయింగ్​
3) మెటీయోరాలజీ ఎంట్రీ
బ్రాంచ్​–ఖాళీలు: మెటీయోరాలజీ–28

అర్హత‌‌లు: ఫ్లైయింగ్ బ్రాంచీకి.. ఇంట‌‌ర్‌‌లో (10+2)లో మ్యాథ్స్‌‌, ఫిజిక్స్ స‌‌బ్జెక్టుల్లో క‌‌నీసం 50 శాతం మార్కులు రావాలి. డిగ్రీ 60 శాతం మార్కుల‌‌తో ఉత్తీర్ణుల‌‌వ్వాలి. గ్రౌంట్ డ్యూటీ టెక్నిక‌‌ల్, నాన్ టెక్నిక‌‌ల్‌‌ బ్రాంచీకి.. 10+2లో ఫిజిక్స్‌‌, మ్యాథ్స్ స‌‌బ్జెక్టుల్లో 60 శాతం మార్కులు, నాలుగేండ్ల డిగ్రీ ఉత్తీర్ణుల‌‌వ్వాలి. ఫ్లైయింగ్​ బ్రాంచ్​ పోస్టులకు 1 జులై 2022 నాటికి 20 నుంచి 24 ఏండ్ల లోపు, మిగిలిన వాటికి 20 నుంచి 26 ఏళ్ల వయసు ఉండాలి. 

సెలెక్షన్​ ప్రాసెస్​: కామన్​ ఎంట్రన్స్​ టెస్ట్, ఇంజినీరింగ్​ నాలెడ్జ్​ టెస్ట్​ (ఈకేటీ), పైలట్​ ఆప్టిట్యూడ్​ బ్యాటరీ టెస్ట్​ (పీఏబీటీ), మెడికల్​ టెస్ట్​ ఆధారంగా 
ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ప‌‌రీక్ష మొత్తం 100 ప్రశ్నల‌‌కు ఉంటుంది. ఇందులో జ‌‌న‌‌ర‌‌ల్ అవేర్‌‌నెస్‌‌, ఇంగ్లిష్‌‌లో వ‌‌ర్బల్ ఎబిలిటీ, న్యూమ‌‌రిక‌‌ల్ ఎబిలిటీ, రీజ‌‌నింగ్‌‌, మిల‌‌ట‌‌రీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటికి మొత్తం 300 మార్కులు ఉంటాయి. ప‌‌రీక్షను 2 గంట‌‌ల్లో రాయాల్సి ఉంటుంది. ప్రతి స‌‌రైన స‌‌మాధానానికి మూడు మార్కులు కేటాయిస్తారు. త‌‌ప్పు జ‌‌వాబుకు ఒక మార్కు కోత విధిస్తారు.

ముఖ్య సమాచారం
ప‌‌రీక్ష ఫీజు: రూ.250. ఎన్‌‌సీసీ స్పెష‌‌ల్ ఎంట్రీకి ఎలాంటి ఫీజు లేదు.
ద‌‌ర‌‌ఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవాలి
అప్లికేషన్స్​ ప్రారంభం: 1 జూన్ 2‌‌021
చివ‌‌రితేదీ: 30 జూన్ 2021
వెబ్‌‌సైట్‌‌: www.careerindianairforce.cdac.in OR www.afcat.cdac.in