
వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పర్యాటక ప్రదేశమైన హా లాంగ్ తీరానికి టూరిస్టులతో వెళ్లిన పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 34 మంది మరణించగా.. పలువురు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న సహయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని రెస్య్కూ ఆపరేషన్ చేపట్టాయి. నీటిలో గల్లంతైన వారిలో కొందరిని రెస్య్కూ టీమ్స్ రక్షించాయి. ప్రతికూల వాతావరణమే ఈ విషాదానికి కారణమని.. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టంగా మారిందన్నారు అధికారులు.
అధికారుల వివరాల ప్రకారం.. వండర్ సీ క్రూయిజ్ బోట్ శనివారం (జూలై 19) మధ్యాహ్నం డౌ గో గుహ సమీపంలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో పడవలో 48 మంది పర్యాటకులు, ఐదుగురు బోట్ సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు 12 మందిని రక్షించాం. నీటిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’’ అని తెలిపారు. పర్యాటకుల్లో 20 మంది చిన్నారులే ఉన్నట్లు సమాచారం. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన గాలులు, అల్లకల్లోలంగా ఉన్న నీటి ప్రవాహం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ధృవీకరించారు.
ఈ ఘటన వియత్నాం ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు కొనసాగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై వెంటనే పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ, ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖలను వెం ఆదేశించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులకు సూచించారు.