ధర్మవరం హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌..34 మందికి అస్వస్థత

ధర్మవరం హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌..34 మందికి అస్వస్థత

గద్వాల, వెలుగు : ఫుడ్‌ పాయిజన్‌తో 34 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హాస్టల్లో సుమారు 120 మంది స్టూడెంట్స్ ఉన్నారు. శుక్రవారం రాత్రి ఏడున్నర గంటలకు డిన్నర్‌లో సాంబార్, రైస్, కాలీఫ్లవర్, ఎగ్‌ తిన్నారు. 

రాత్రి 9 గంటల టైంలో 34 మంది స్టూడెంట్స్‌ వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది మూడు అంబులెన్స్‌లలో స్టూడెంట్లను గద్వాల హాస్పిటల్‌కు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.