
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ ‘35 - చిన్న కథ కాదు’. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని దర్శకుడు. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. రానా మాట్లాడుతూ ‘స్కూల్‌లో ఉన్నప్పుడు 35 పాస్ మార్క్ అనేది నాకు పెద్ద పర్వతం లాంటిది (నవ్వుతూ). అందుకే నందు ఈ కథ చెప్పినపుడు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి.
అలాగే మా అమ్మ కూడా గుర్తొచ్చింది. ఇది మన అందరి కథ. చాలా మంది లైఫ్ ఇలానే ఉంటుంది. దీన్ని అందరూ రిలేట్ చేసుకుంటారు’ అని అన్నాడు. నివేదా మాట్లాడుతూ ‘ఇది నా కెరీర్‌లో చాలా స్పెషల్ ఫిల్మ్. తల్లి పాత్రలో కనిపిస్తా. నేను చేసిన క్యారెక్టర్స్‌లో చాలా డిఫరెంట్ ఇది. ఇలాంటి మంచి కథలో నటించడం హ్యాపీ’ అని చెప్పింది. చాలా కాలం గుర్తుండిపోయే సినిమా ఇదని విశ్వదేవ్ అన్నాడు. ఇది చిన్న కథ కాదని, పెద్ద సినిమా అని దర్శక నిర్మాతలు చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.