నల్లబెల్లి, వెలుగు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 350 బస్తాల్లోని మక్కజొన్నలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన వరంగల్జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో జరిగింది. గ్రామస్తుల వివరాల మేరకు.. పొగాకు శ్రీనివాస్ అనే రైతు ప్రభుత్వ గోదాం సమీపంలో మక్కజొన్నలను కుప్పగా పోశాడు. గురువారం సాయంత్రం వీచిన గాలి దుమారానికి కరెంటు తీగలు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ తో నిప్పు రవ్వలు కుప్పలపై పడి మంటలు అంటుకున్నాయి.
ప్రమాదంలో మక్కలు పూర్తిగా దగ్ధమయ్యాయిని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కాలిపోయిన మక్కల విలువ రూ.3 లక్షలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నాడు.
