
హైదరాబాద్, వెలుగు: ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పీజీఈసెట్–2023సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ ముగిసింది. కన్వీనర్ కోటాలో 5,812 సీట్లు ఉండగా, 3,592మందికి సీట్లు కేటాయించినట్లు పీజీఈసెట్ అడ్మిషన్ల కన్వీనర్ రమేశ్ బాబు తెలిపారు.
ఎంటెక్ లో 1,819 మందికి, ఎంఫార్మసీలో 1,765, ఎంఆర్క్ లో 8 మందికి సీట్లు అలాటైనట్లు చెప్పారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల7 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. కాగా, ఫస్ట్ ఫేజ్ లో 5,662 మందికి సీట్లు అలాటైతే 3627 మంది రిపోర్టు చేశారని తెలిపారు.
పీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు
బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. కన్వీనర్ కోటాలో 1,819 సీట్లుండగా, 785 మందికి సీట్లు అలాటైనట్టు సెట్ అడ్మిషన్ల కన్వీనర్ రమేశ్ బాబు చెప్పారు. ఈ నెల 7 వరకూ కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు.