కాబోయే అల్లుడికి సంవత్సరానికి సరిపడా తిండిపెట్టారు

V6 Velugu Posted on Jan 17, 2022

సంక్రాంతి పండుగ వస్తే కొత్త అల్లుళ్లకు అత్తారింటి వాళ్లు సకల మర్యాదలు చేస్తుంటారు. రకరకాల పిండి వంటకాలతో ఆతిథ్యం ఇస్తారు.  అయితే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మనవ రాలికి, ఆమెకు కాబోయే భర్తకు ఓ తాతయ్య ఇచ్చిన విందు భోజనం నెట్టింట వైరల్ గా మారింది. కాబోయే అల్లుడికి ఒకటి రెండు కాదు.. ఏకంగా 365 వంటకాలతో ఆతిథ్యం ఇచ్చింది ఆ కుటుంబం. కూతురు నిశ్చితార్థం అయిన తర్వాత వచ్చిన మొదటి పండుగ సంక్రాంతి కావడంతో వధూవరులకు వివిధ రకాల వంటకాలతో డిన్నర్ అరేంజ్ చేశారు. అలాగే మరో కుటుంబం కొత్త అల్లుడికి ఇచ్చిన ఆతిథ్యం కూడా వైరల్ గా మారింది. అన్నం, పులిహార, బిర్యానీలు, దద్దోజనం వంటి వంటకాలతో పాటు, పదుల రకాల కూరలు, పిండివంటలు, వందల రకాల స్వీట్స్, రకరకాల ఐస్ క్రీంలు, డ్రింక్ లు, రకరకాల బిస్కెట్లు, కేకులు వంటి వందల రకాలతో విందు ఏర్పాటు చేశారు.

 

Tagged West godavari, 365 Variety Dishes, New Groom, narasapuram

Latest Videos

Subscribe Now

More News