హైదరాబాద్​లో38 మందినామినేషన్లు ఆమోదం

హైదరాబాద్​లో38 మందినామినేషన్లు ఆమోదం
  •  19 మందివి తిరస్కరణ

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ సెగ్మెంటుకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభ్యర్థులు, వారి తరఫున హాజరైన ప్రతినిధుల ముందు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, ఐఏఎస్ అధికారి పీఐ శ్రీవిద్య పర్యవేక్షించారు. -హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి మొత్తం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

 క్రమ పద్ధతిలో వాటిని పరిశీలించి వివరాలు, పత్రాలు సక్రమంగా ఉన్న నామినేషన్లను అధికారులు ఆమోదించారు. లోపాలున్నా, సరిగా వివరాలు సమర్పించని 19  మంది నామినేషన్లను తిరస్కరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. 38 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినట్లు చెప్పారు.  తిరస్కరణకు గురైన అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ను తిరిగి చెల్లిస్తామన్నారు.  నామినేషన్ తిరస్కరణకు గల కారణాలను కూడా అభ్యర్థులకు అందిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, ఏఆర్ఓలు, అధికారులు, అభ్యర్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు.