
పంజాగుట్ట, వెలుగు : బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 381 ఫిర్యాదులు అందాయి. వీటిలో గృహనిర్మాణ శాఖకు సంబంధించి 72, ఎస్సీ సంక్షేమ శాఖకు 56, రెవెన్యూకు 51, విద్యుత్ శాఖకు 40, పంచాయితీ రాజ్గ్రా
మీణ అభివృద్ధికి సంబంధించి 28, మైనారిటీ వెల్ఫేర్కు 25, ప్రవాసీ ప్రజావాణి ద్వారా 5, ఇతర శాఖలకు చెందినవి 94 ఉన్నాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్చిన్నారెడ్డి పర్యవేక్షణలో నోడల్ఆఫీసర్ దివ్య ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.