
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,821 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 5,60,141 కేసులు నమోదు కాగా.. 38,706 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని చెప్పింది. తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలో 24 గంటల్లో కరోనాతో 23 మంది మృతి చెందారని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,169 కి చేరిందని.. తెలంగాణలో ఈ రోజు 4298 మంది డిశ్చార్జ్ అయ్యారంది. ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలో 537, ఖమ్మంలో 245 , రంగారెడ్డిలో 226 ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది ఆరోగ్యశాఖ.