
గచ్చిబౌలి, వెలుగు : మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా.. మందుబాబుల్లో మార్పు రావడం లేదు. కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నా.. పలువురిలో భయం కనిపించడం లేదు. సైబరాబాద్ కమిషనరేట్పరిధిలో శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల లిమిట్స్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 385 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 292 బైకులు, 11ఆటోలు, 80 కార్లు, 2 లారీలు ఉన్నాయి. ఐటీ కారిడార్ లిమిట్స్‌లోనే 182 మంది పట్టుబడ్డారు. నలుగురు వ్యక్తులు 550ఎంజీ/100ఎంఎల్ మోతాదుకు మించి మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. వీరందరిని కోర్టులో ప్రవేశ పెడుతామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.