
Bengaluru Rents: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పొరుగున ఉన్న కర్ణాటన రాజధాని బెంగళూరుకు చాలా మంది వెళుతుంటారు. ఈ క్రమంలో ఉద్యోగ అవసరాల కోసం వెళ్లే ఐటీ ఎంప్లాయిస్ ఎక్కువగా ఉంటారని మనందరికీ తెలిసిందే. కానీ అక్కడ వచ్చే ఆదాయం చూసి సంతోషపడాలో లేక అక్కడి ఇంటి అద్దెలు చూసి ఆందోళన చెందాలో చాలా మందికి అర్థం కాని విషయం. తాజాగా ఇలాంటి సంఘటన ఒకదాన్ని వ్యక్తి రెడిట్ లో పంచుకున్నాడు.
సదరు వ్యక్తి బెంగళూరులోని హరలూర్ ప్రాంతంలో ఒక 3 బెడ్ రూమ్ ఇంటి అద్దె చూసి షాక్ అయ్యాడు. హరలూర్ హౌసింగ్ సొసైటీలో ఇంటి యజమానికి నెలకు రూ.2లక్షల 70 వేలు అద్దె డిమాండ్ చేయటంతో షాక్ అయిపోయాడు ఆ వ్యక్తి. పైగా ఇంటి ఓనర్ అద్దెదారుడు రూ.15 లక్షలు డిపాజిట్ చేయాలని కండిషన్ పెట్టాడు. నో బ్రోకర్ వెబ్ సైట్ లో సదరు యజమాని గొంతెమ్మ కోరికలు చూసిన వ్యక్తి ఆ విషయాన్ని నెట్టింట పంచుకున్నాడు.
తాను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా లేక బెంగళూరులోని ప్రజలు అధికంగా రెంట్స్ పే చేస్తున్నారా అంటూ సదరు వ్యక్తి ప్రశ్నించాడు. కేవలం ఒక అపార్ట్మెంట్ అద్దె ముంబై మహానగరంలో మాదిరిగా ఉండటంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనిపై రెడిట్ యూజర్లు స్పందిస్తూ.. సదరు ఓనర్ రెంట్ విషయంలో ఒక సున్నా ఎక్కువగా పెట్టాడేమో పొరపాటున అని కామెంట్ చేశారు. మరో వ్యక్తి ఇంత అద్దె కట్టాలంటే లోన్ తీసుకోవాల్సిందే అంటూ కామెంట్ చేశాడు.
ALSO READ : New Tax Rules: తప్పుడు టాక్స్ డిడక్షన్ క్లెయిమ్స్ ఇక కుదరవ్.. షేక్ చేస్తున్న కొత్త రూల్స్
మరికొందరు ఇదొక ఫేక్ పోస్ట్ అయి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అందులో పేర్కొన్న అద్దె వాస్తవంగా ఆ ప్రాంతంలో ఉన్న వాటి కంటే చాలా ఎక్కువగా ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరొకరు తాను అదే సొసైటీలు నివసిస్తున్నానని.. ఆ పోస్ట్ తమ సొసైటీ వ్యక్తులకు షేర్ చేస్తే అందరూ నవ్వారని కామెంట్ చేశాడు. మెుత్తానికి బెంగళూరులో సామాన్యుల ఊహలకు సైతం అందని అద్దెలు, అడ్వాన్సులు ఉండటం ప్రస్తుత కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. చాలా మంది దీన్ని చూసి అక్కడ అద్దె కట్టడం కంటే సొంత ఇల్లు కొనుక్కుని దానికి ఈఎంఐ చెల్లించుకోవటం బెటర్ అని అంటున్నారు.