
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది. మంగళ, బుధవారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. రాష్ర్టంలో సోమవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి, వేములవాడ రూరల్ మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడ్డాయి.