ఇన్నోవా, ఎర్టికా కార్లలో ఆవులు ఎత్తుకెళుతున్న దొంగలు : హైదరాబాద్ సిటీలో అర్థరాత్రి అరాచకాలు

ఇన్నోవా, ఎర్టికా కార్లలో ఆవులు ఎత్తుకెళుతున్న దొంగలు : హైదరాబాద్ సిటీలో అర్థరాత్రి అరాచకాలు

హైదరాబాద్ లో ఆవుల దొంగలు పడ్డారు. ఖరీదైన కార్లలో తిరుగుతూ ఎవరికీ డౌట్ రాకుండా ఆవులను ఎత్తుకెళ్తున్నారు. శుక్రవారం (ఆగస్టు 01) రాత్రి  సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగలిస్తున్న దొంగల ముఠా సీసీకెమెరాలో రికార్డు అయ్యింది. మోండా డివిజన్ బండి మెట్, సెకండ్ బజారు లో ఆవుల చోరీకీ పాల్పడుతూ కనిపించారు దుండగులు. 

అర్ధరాత్రిర ఖరీదైన కారులో వచ్చి ఆవులను కార్ల లో వేసుకొని పారిపోయారు దొంగలు. ఇన్నోవా, ఎర్టిగా కార్లలో ఆవులను బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లారు. రెండు చోట్ల ఇదే ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. 

సిటీలో ఆవుల దొంగలు పడటం ఇది మొదటి సారి కాదు. పలు ప్రాంతాల్లో గోవులకు మత్తు మందు ఇచ్చి కార్ల ల్లో ఎత్తుకెళుతున్నారు. గతంలో మారేడు పల్లిలో ఇలాంటి దొంగతనానికి పాల్పడ్డ దుండగులు.. ఇప్పుడు అలాంటి చోరీలకే పాల్పడటంతో మోడా మార్కెట్ పీఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు.