
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి ఆర్జించిన లాభాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మందమర్రి ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లపై కార్మికులు ఆందోళన చేపట్టారు. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ సుదర్శనం ఆధ్వర్యంలో ఆయా గనులు, డిపార్ట్మెంట్ల వద్ద కార్మికులు, యూనియన్ శ్రేణులు సింగరేణి యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ ధర్నాలకు దిగారు. లీడర్లు మాట్లాడుతూ.. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు గడుస్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు ఈ ఏడాది ఆర్జించిన లాభాలను ప్రకటించలేదన్నారు. లాభాలను ప్రకటించిన తర్వాతే కార్మికులకు పంపిణి చేసే వాటాను తేల్చాల్సి ఉంటుందని, అయినా ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
కార్మికులకు క్వాలిటీ షూలు అందించాలని, సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, మెడికల్రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్చేశారు. రిటైర్డ్ కార్మికులకు సీపీఆర్ఎంఎస్ద్వారా అందించే ఆసుపత్రి ట్రీట్మెంట్ ఛార్జీలు వసూలు చేయవద్దని కోరారు. రిటైర్మెంట్బెని ఫిట్స్ వెంటనే సెటిల్ చేయాలని, మందమర్రి లోని గనులు, డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను ఆయా గనులు, డిపార్ట్మెంట్ల సింగరేణి ఉన్నతాధికారులకు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, పిట్ సెక్రట రీలు గాండ్ల సంపత్, మర్రి కుమారస్వామి, పారిపల్లి రాజేశం, కలవేల శ్రీనివాస్, కె. ఓదెలు, సృజన గీతిక తదితరులు పాల్గొన్నారు.