సిటీ నలుమూలల్లో 4పెద్ద లైబ్రరీలు ఏర్పాటు చేస్తం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

సిటీ నలుమూలల్లో 4పెద్ద లైబ్రరీలు ఏర్పాటు చేస్తం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఏదైనా మంచి పని చేసే టప్పుడు మంచి పుస్తకం ఇవ్వండని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అఫ్జల్ గంజ్ లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో 
 55వ నేషనల్ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన సబితా ఇంద్రారెడ్డి...  గ్రంధాలయం రిటైర్డ్ ఉద్యోగులు, స్టాఫ్ ను సన్మానించారు. సీఎం కేసీఆర్ గ్రంథాలయాలను అభివృద్ధి చేశారని, గత మూడు సంవత్సరాలు గా లైబ్రరీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సిటీ స్టేట్ లైబ్రరీ ప్రతిష్టమైందన్న ఆమె... ఈ స్టేట్ లైబ్రరీ కి చరిత్ర ఉందని తెలిపారు. ఎంతో మంది అధికారులు ఈ లైబ్రరీ లో చదువు కున్నారన్నారు. ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితమే 80 వేల ఉద్యోగాలు ప్రకటించిందని మంత్రి గుర్తు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నవారికి లైబ్రరీలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. 

సిటీలో నలుమూలల్లో 4పెద్ద లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. భవిష్యత్ లో మరిన్ని లైబ్రరీ లు రావాలన్న మంత్రి.. .సిటీలో ఉన్న లైబ్రరీలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ పుస్తకాలు అందాలని, పిల్లలకు పుస్తకాలు చదవడం నేర్పించాలన్నారు. ప్రతి స్కూల్, కాలేజ్ లో లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నామన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఛైర్మన్ శ్రీధర్ రెడ్డి,   గ్రంథాలయ ఛైర్మన్ శ్రీధర్, రాష్ట్ర గ్రంధాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.