వచ్చే వారం బ్యాంకులకు 4 రోజులు సెలవు

వచ్చే వారం బ్యాంకులకు 4 రోజులు సెలవు

న్యూఢిల్లీ: బ్యాంకులు వచ్చే వారం మొత్తంలో కేవలం మూడు రోజులే పనిచేయనున్నాయి. బ్యాంకుల బంద్ తో పాటు, ఇతర హాలిడేస్‌ రావడంతో బ్యాంకులకు వరుసగా సెలవులున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ),
ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌(ఏఐబీఓఏ) ఈ నెల 27(శుక్రవారం) న బ్యాంకుల బంద్ కు పిలుపునిచ్చాయి. గుడి పడ్వా, ఉగాది పండుగలతో మార్చి 25(బుధవారం)న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మణిపూర్‌ వంటి రాష్ట్రాలలో బ్యాంక్ లకు సెలవు. మార్చి
26(గురువారం)న బ్యాంకులు తిరిగి ఓపెన్ అవుతాయి.

కానీ తర్వాతి రోజు ఉద్యోగులు సమ్మె తలపెడుతున్నారు. ఇక, మార్చి 28న నాలుగో శనివారం, 29 న ఆదివారం కావడంతో సాధారణంగానే బ్యాంకులకు సెలవులు. కానీ ఆ తర్వాత ఇది మానుకున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంకుల విలీనం అమలులోకి వస్తుండడంతో ప్రభుత్వం ఈ చర్యను వెనక్కి తీసుకోవాలని బ్యాంక్‌ యూనియన్లు ఇంకా డిమాండ్ చేస్తున్నాయి.