
- ఢిల్లీ ఎయిర్ పోర్టులో సీజ్ చేసిన అధికారులు
న్యూఢిల్లీ : ఓ విమానం టాయిలెట్ లో దాచి ఉంచిన నాలుగు కిలోల బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఆ ఫ్లైట్ దిగిన తర్వాత గోల్డ్ ను సీజ్ చేశామని ఆఫీసర్లు తెలిపారు. ఆ బంగారు బిస్కెట్ల విలువ దాదాపు రూ.2 కోట్లు ఉండవచ్చని చెప్పారు. విమానంలో గోల్డ్ బిస్కెట్లను స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని, ఫ్లైట్ ను టర్మినల్ 2 వద్ద చెక్ చేయగా బంగారం దొరికిందని వెల్లడించారు. టాయిలెట్ సీట్ కింద ఓ పౌచ్ లో నాలుగు బంగారు బిస్కెట్లు కనిపించాయని చెప్పారు.