4 కి.మీ. దూరం అయ్యప్పల పొర్లు దండాలు

4 కి.మీ. దూరం అయ్యప్పల పొర్లు దండాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శుక్రవారం అయ్యప్ప స్వాములు 4 కిలోమీటర్ల మేర పొర్లు దండాలు(అంగ ప్రదక్షణలు) పెట్టారు. శబరిమల టెంపుల్​లోకి ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతిఒక్క అయ్యప్ప మాలధారుడిని అనుమతించేలా చూడాలని, కరోనా పూర్తిగా తొలగిపోయి ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ గురుస్వామి కన్నెగంటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చుంచుపల్లి మండలం శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్​నుంచి కొత్తగూడెంలోని గణేశ్​​ టెంపుల్ వరకు అయ్యప్ప స్వాములు పొర్లు దండాలు పెట్టారు. విద్యానగర్ కాలనీ పంచాయతీ ఆధ్వర్యంలో 4 కిలోమీటర్లు మేర రోడ్డును నీళ్లతో తడిపారు. కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ ప్రాంతాల అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొర్లు దండాల కార్యక్రమానికి ఆటంకం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్​మళ్లించారు.