హెల్త్‌ వర్కర్లకు‌ జీతాల చెల్లింపులో రాష్ట్రాలు తాత్సారం

హెల్త్‌ వర్కర్లకు‌ జీతాల చెల్లింపులో రాష్ట్రాలు తాత్సారం

సుప్రీంకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా పై పోరులో ముందుండి పోరాడుతున్న హెల్త్‌కేర్ వర్కర్స్‌కు సరైన టైమ్‌లో వేతనాలు ఇవ్వడంలో నాలుగు రాష్ట్రాలు జాప్యం చేస్తున్నాయని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ లిస్ట్‌లో పంజాబ్, మహారాష్ట్ర, త్రిపుర, కర్నాటక ఉన్నాయని.. అత్యున్నత ధర్మాసనం సూచనలను ఈ రాష్ట్రాలు బేఖాతరు చేశాయని పేర్కొంది. దీనికి స్పందనగా సుప్రీం స్పందిస్తూ వర్కర్స్‌కు వేతనాలు అందేందుకు కృషి చేయాలని కేంద్రానికి సూచించింది.

‘మీ సూచనలను రాష్ట్రాలు పట్టించుకోకపోతే నిస్సహాయులమని కేంద్ర ప్రభుత్వం భావించరాదు. మీ ఉత్తర్వులు అమలయ్యేలా చూడండి. డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ కింద అధికారాలను వాడే అవకాశం మీకు ఉంది. మీరు చర్యలు తీసుకోవచ్చు’ అని అశోక్ భూషణ్, ఆర్‌‌ సుభాష్​ రెడ్డి, ఎంఆర్ షాల త్రిసభ్య ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తాకు తెలిపింది. డాక్టర్‌‌లు, నర్సుల వేతన బకాయిలను క్లియర్ చేయాలంటూ జూన్‌లో సుప్రీం సూచించింది. యుద్ధంలో సైనికులను బాధగా ఉంచలేరని అపెక్స్‌ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో కరోనాపై పోరు సమయంలో హెల్త్‌వర్కర్‌‌ల వేతానాల మంజూరుకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా కేంద్రం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ (డీఎంఏ) జారీ చేసింది. దీన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.