మొసలి గుడ్ల కోసం ట్రై చేసి.. మొసళ్లకు బలైపోయిండు

మొసలి గుడ్ల కోసం ట్రై చేసి.. మొసళ్లకు బలైపోయిండు

ఫనోమ్​పెన్హ్​ (కంబోడియా): మొసలి గుడ్లను ఎన్ క్లోజర్​ నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని 40 మొసళ్లు దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన కంబోడియాలోని ఫనోమ్​ పెన్హ్​లో శుక్రవారం జరిగింది. 72 ఏళ్ల వ్యక్తి ఎన్ క్లోజర్​లోని మొసలి గుడ్లను బయటకు తీసే క్రమంలో గుడ్ల దగ్గర ఉన్న మొసలిని బయటకు పంపేందుకు కర్రతో పొడిచాడు.  కర్రను మొసలి నోటితో లాగడంతో ఎన్​క్లోజర్​లో పడిపోయాడు. దీంతో 40 మొసళ్ల గుంపు ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది.  బాధితుడి శరీరాన్ని చీల్చేయడంతో ఎన్​క్లోజర్​ రక్తంతో  తడిచిందని పోలీసులు తెలిపారు.

మొసళ్లు తినేయగా మిగిలిన శరీరాన్ని బయటకు తీశామని వెల్లడించారు. మృతుడి చేతుల్లో ఒకదాన్ని మొసళ్లు కొరికి మింగేశాయన్నారు. అంగర్​కోట్​ గేట్ వే అనే ఈ ప్రాంతంలో చాలా మొసళ్ల ఫామ్​లు ఉన్నాయి. గుడ్లు, చర్మం, మాంసంతోపాటు యుక్తవయస్సులో ఉన్న మొసళ్లను విక్రయించేందుకు  రెప్టైల్​ఫామ్​లు ఏర్పాటు చేస్తారు. కాగా, 2019లో రెండేళ్ల బాలికను మొసళ్లు చంపి తినేశాయి. బాలిక కుటుంబానికి సంబంధించిన మొసళ్ల ఫామ్​లో ఈ ఘటన చోటుచేసుకుంది.