19.5 కోట్ల మంది జాబులు ఊడుతాయ్

19.5 కోట్ల మంది జాబులు ఊడుతాయ్

న్యూఢిల్లీ: చేయడానికి పని లేదు.. ఉండడానికి ఇల్లు లేదు. పూట గడవని పరిస్థితి. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మూటాముల్లె నెత్తిన పెట్టుకుని, పిల్లల ను చంకనెత్తుకుని పల్లె బాట పట్టారు చాలా మంది. వాళ్లందరూ ఎలాంటి జాబ్ సెక్యూరిటీలేని అసంఘటిత రంగ కార్మికులే. ఇదంతా కరోనా పుణ్యమే. పరిస్థితి ఇలాగే ఉంటే దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 40 కోట్ల మంది పేదరికంలోకి జారుకునే ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆరనైజేషన్స్  (ఐఎల్వో) హెచ్చరించింది. కరోనా ఎఫెక్ట్ తో  అమలవుతున్న లాక్ డౌన్ వల్లే ఈ సమస్య ఎదురైందని చెప్పింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్  తయారు చేసిన కొవిడ్ 19 గవర్నమెంట్ రెస్పాన్స్ స్ట్రింజెన్సీ ఇండెక్స్ ప్రకారం, దేశంలో లాక్ డౌన్ రూల్స్ కఠినంగా ఉన్నాయంది.

బుధవారం కొవిడ్ 19 అండ్ వరల్డ్ ఆఫ్ వర్క్ పేరిట ఐఎల్వో సెకండ్ ఎడిషన్ రిపోర్ట్ను విడుదల చేసింది. కరోనా సంక్షోభం రెండో ప్రపంచ యుద్ధం కన్నా దారుణమని పేర్కొంది.

19.5 కోట్ల మంది జాబులు ఊడుతాయ్

ప్రపంచ వ్యాప్తంగా 19.5 కోట్ల మందికి ఫుల్ టైం జాబులు పోతాయని ఐఎల్వో హెచ్చరించిం ది. అంటే మొత్తం పని గంటల్లో 6.7 శాతం వరకు కోత పడుతుందని చెప్పింది. నిరుద్యోగ రేటు ఎకానమీ ఎంత త్వరగా కో లుకుంటుందన్న దానిపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో  330 కోట్లమంది ఉద్యోగులు ఇళకే పరిమితమై పోయారని చెప్పింది. అందులో ఎక్కువగా 200 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారేనని తెలిపింది. ప్రతి ఐదుగురిలో నలుగురు (81%) ఉద్యోగులపై ఎఫెక్ట్ పడిందని పేర్కొంది.యూరప్ లో 1.2 కోట్లు, ఆసియా పసిఫిక్ లో 12.5 కోట్లు, అమెరికాలో 50 లక్షల మంది జాబులు కోల్పోయే పరిస్థితి వస్తుందని పేర్కొంది.

అన్ని దేశాలకూ పెద్ద పరీక్ష

ప్రపంచదేశాలకు ఇదో పెద్ద పరీక్ష. ఒక దేశం ఫెయిలైతే, అన్ని దేశాలు ఫెయిలైనట్టే . అన్ని సెగ్మెంట్ల లో సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతుంది. – గుయ్ రైడర్, ఐఎల్వో డైరెక్టర్ జనరల్

ఏయే రంగాలపై ఎఫెక్ట్..?

హోటల్ అండ్ ఫుడ్ సర్వీసెస్, మాన్యు ఫాక్చరింగ్, హోల్ సెల్ అండ్ రిటైల్ వ్యాపారం, రియల్ఎస్టేట్ వంటి రంగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని ఐఎల్వో పేర్కొంది. ఈ అన్నిసెక్టార్లలో కలిపి 125 కోట్ల మంది పనిచేస్తున్నా రని చెప్పింది. వివిధ దేశాల్లోని పరిస్థితులను బట్టి వాళ్ల ఉద్యోగాల్లో  కోతపడే అవకాశముందని పేర్కొంది. అన్నీ సెక్టార్లలో కల్లా ఎక్కువగా హోల్ సెల్  అండ్ రిటెయిల్ ట్రేడ్ పైనే  పడుతుందని హెచ్చరించింది. అందులో 48.2 కోట్ల మందిపై ప్రభావం పడుతుందని, ఆరోగ్యం విషయంలోనూ రిస్క్ తప్పదని తెలిపింది. ఈ ఎఫెక్ట్ ప్రాంతాలను బట్టి మారుతుందని, ఎక్కువ ఎఫెక్ట్ మాత్రం అమెరికా పైనే ఉంటుందని ఐఎల్వో హెచ్చరించింది.