చిట్యాలలో 40 కిలోల బంగారం, 180 కిలోల వెండి పట్టివేత

చిట్యాలలో 40 కిలోల బంగారం, 180 కిలోల వెండి పట్టివేత

నార్కట్​పల్లి, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న తనిఖీలలో భారీగా బంగారం, నగదు పట్టుబడుతున్నది. గురువారం ఎన్​హెచ్​65పై నల్గొండ జిల్లా చిట్యాల టౌన్ లోని రైల్వే స్టేషన్ క్రాసింగ్ వద్ద పోలీసులు 40 కేజీల బంగారం, 180 కేజీల వెండి ఆభరణాలు పట్టుకున్నారు. సీఐ మహేశ్, ఎస్ఐ రవి, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న ఏపీ 39 టీజీ 8761 నంబర్ గల బొలెరో ను తనిఖీ చేశారు. అందులో 30 కిలోల బంగారం, 108 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు గుర్తించారు. టీఎస్​ 08 యూజీ 8122 నంబర్ గల మరో వాహనాన్ని తనిఖీ చేసి 10 కేజీల బంగారం పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీటికి సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.