వెల్దుర్తి, వెలుగు: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచలో రోడ్డు పక్కన ఆరబోసిన నాచారం మహేశ్ అనే రైతుకు చెందిన సుమారు 40 బస్తాలకు పైగా ధాన్యం మంగళవారం దగ్ధమైంది. గుర్తుతెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టడంతో నిప్పు రవ్వలు ఎగిసిపడి వడ్ల కుప్పపై పడింది. స్థానిక రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాకపోవడంతో ధాన్యం పూర్తిగా దగ్ధమైంది.
