హైదరాబాద్, వెలుగు: నెట్‌వర్కింగ్ ఆర్గనైజేషన్ బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్‌ఐ) హిస్టరిలోనే తొలిసారిగా 'బీఎన్ఐ ఆల్ఫా', 'బీఎన్ఐ అఫినిటీ' పేరిట ఒకేసారి రెండు చాప్టర్లను బీఎన్‌ఐ హైదరబాద్ ప్రారంభించింది. 66, 67వ చాప్టర్లు ఆవిర్భవించిన ఈ వేడుకలో, 102 మంది వ్యవస్థాపక సభ్యులు పాల్గొన్నారు.
ఈ రెండు చాప్టర్ల సభ్యులు అధికారిక ప్రారంభానికి ముందే 500కు పైగా బిజినెస్ రెఫరల్స్‌ను ఇచ్చుపుచ్చుకోవడం విశేషం. ఈ సందర్భంగా బీఎన్ఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా మాట్లాడుతూ.. లండన్, న్యూయార్క్, ముంబై వంటి గ్లోబల్ బిజినెస్ హబ్‌లను వెనక్కి నెట్టి హైదరాబాద్ ఈ ఘనత సాధించడం గర్వకారణమన్నారు.
